welcome to www.toopran.blogspot.com, to know more about your village information please JOIN in these blog

Tuesday, 25 June 2013

విషయ సూచిక

  [దాచు

 

చరిత్ర, సంస్కృతి[మార్చు]

  • ఈ గ్రామం కాకతీయుల కాలము నాటిదని ప్రశస్తి. ఈ గ్రామం తదనంతర కాలంలో దొంతి సంస్థానములో భాగంగా ఉండేది. దొంతి సంస్థానముకు మరియు వడ్డేపల్లి సంస్థానముకు సరిహద్దు గ్రామముగా విలసిల్లింది. ఆ కాలంలోనే మంచి వ్యాపార కేంద్రంగా భాసిల్లింది .
  • హిందు ముస్లిం సమైక్యత, హోలి నాడు జరిగే సంబరాల్లో పిడి తాడు లాగే సంప్రదాయం ఉంది. మహంకాలి జాతర తెలంగాణలో మొత్తము ముగిసిన తరువాత శ్రావణ మాసంలో ఘనంగా జరుగుతుంది, కుల, మత భేద రహితంగా అన్ని మతాల వారు ఇందులో పాల్గొంటారు. గ్రామములోని స్వయంభువు రామాలయములో ఏటా రామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి.

సదుపాయాలు[మార్చు]

  • ఒక ప్రాధమిక పాఠశాల, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల బాలికలకు ప్రత్యేకంగా కలదు ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాల కలదు.
  • సుమారు 15 ప్రయివేటు పాఠశాలలు కలవు. ఒక ప్రభుత్వ జునియర్ కళాశాల, 3 ప్రయివేటు జునియర్ కళాశాలలు, 2 ప్రయివేటు డిగ్రి కళాశాలలు, ఒక ప్రయివేటు బిఎడ్, ఒక ప్రయివేటు బిఫార్మసి, 3 ప్రయివేటు పిజి కళాశాలలు కలవు
  • ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము 8 ప్రయివేటు వైద్యశాలలు కలవు. ఒక ప్రభుత్వ గ్రంధాలయము, పోస్టాఫీసు, బస్సు సౌకర్యం కలదు. హైదరాబాదు నుండి, హైదరాబాదుకు ప్రతి 15 నిముషాలకు ఒకసారి బస్సులు కలవు. సమీపాన 2 రైల్వేస్టేషన్లు కలవు.
  • వివిధ రంగాలకు సంబందించిన బహు వ్యాపార సంస్థలు కలవు. 1 సినిమా హాలు కలదు.

సమస్యలు[మార్చు]

  • ట్రాఫిక్ స్థిరీకరణ లెకపొవడం
  • పారిశుధ్య నిర్వహణ లోపం

ఆర్థికం[మార్చు]

  • గ్రామానికి ప్రధాన నీటి వనరు పెద్ద చెరువు, ఇదే కాక మేడక్క చెరువు, కొత్త చెరువు, వీటితో పాటు గ్రామానికి కిలోమీటరు దూరంలోని పసుపులేరు వాగుకు వెళ్ళె లింక్ కాల్వ కూడా వ్యవసాయానికి, త్రాగునీటికి ప్రధాన జల వనరులు, వరి, చెరుకు, మొక్కజొన్న ప్రధాన పంటలు, కూరగాయల సాగు కుడా జరుగుతుంది. సాధారణ గ్రామీణ వృత్తులు అన్ని యధావిధిగా కొనసాగుతున్నాయి. అదే విదంగా ప్రొ ఆగ్రొ, టాటా కాఫీ కంపెనిలు కలవు మరియు కాళ్ళకళ్ పెద్ద పారిశ్రామిక వాడ, పాడి పరిశ్రమ చాలా పెద్దది, సుగుణ కోళ్ళ దాణా కేంద్రము ఆసియాలోనే పెద్దది .

ఆలయాలు[మార్చు]

  • ప్రాచీన రామాలయం ఊరికి చివర కలదు, ఉజ్జయిని మహంకాళీ దేవాలయం కూడా ప్రాచీనమైనదే. అయితే ఉజ్జయని మహంకాళీ దేవాలయంకు ఒక ప్రాముఖ్యత ఉంది. పట్టణానికి 55 కి.మీ. దూరంలో ఉన్న హైదరబాద్ లస్కర్ ఉజ్జయిని మహంకాళీ దేవాలయంలో అమ్మవారి ప్రతిష్ఠ గురించి అప్పటి పూజారులు మహారాష్ట్ర ఉజ్జయని పట్టణం నుంచి గంఢ ద్వీపాన్ని తీసుకువస్తుండగా మార్గమధ్యంలో తూప్రాన్ పట్టణానికి చేరుకొగానే చీకటి పడడంతో వారు ఆ ద్వీపాన్ని, అక్కడ ద్వీపాన్ని వెలిగించి మరుసటి రోజు హైదరబాద్‌కు చేరుకున్నారు. గ్రామంలోని శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం 500 సంవత్సరాల నాటిది. ప్రాచీన బాలాంజనేయ స్వామి దేవాలయమును 1994లో పునర్నిర్మాణము చేయడము జరిగింది. కప్పర నరసింహ స్వామి దేవాలయం కలదు. ఇవేకాక 2 హనుమాన్ దేవాలయాలు, ఒక శివాలయము, ఒక అయ్యప్ప దేవాలయం, ఒక సాయి బాబ దేవాలయం, ఒక గీతా మందిరం కలదు.

చర్చిలు, మసీదులు[మార్చు]

  • గ్రామంలో 3 చర్చిలు, 3 మసీదులు కలవు .

ప్రముఖులు[మార్చు]

శ్రీ రాముని గారి సత్యనారాయణ గౌడ్ గారు వీరు స్వాతంత్ర్య సమరయోధులు మరియు గ్రామ మొదటి సర్పంచ్. వీరు 30 ఏళ్ళ పాటు ఏకచత్రాదిపత్యాముగా గ్రామాన్ని పాలించారు చీదు గోపాల్ రెడ్డి, రాముని గారి రామస్వామి మొదలగు వారు భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గోన్నారు ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకుడు, ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్(గద్దర్) మొదలగు వారు గ్రామానికి చెందిన పుర ప్రముఖులు

ఇతర విశేషాలు[మార్చు]

1998-2004 కాలంలో చెక్ డ్యాంల నిర్మాణము జరిగింది. గ్రామము అంతటా సిసి రోడ్లు వేయడము జరిగింది .బైర్రాజు ఫౌండేషన్ వారి సహకారంతో మినరల్ వాటర్ ఫ్లాంట్‌ను గ్రామ పంచాయతి వారు నిర్మించడం జరిగింది. రీడ్స్ అనే స్వచ్చంద సంస్థ బాల కార్మికుల విద్యాభీవృద్దికై ఒక పాఠశాలను నిర్వహిస్తోంది .
  • తూప్రాన్‌కు సరిహద్దులుగా తూర్పున నాచారం లక్ష్మినరసింహ స్వామి వారు
  • పశ్చిమాన దొంతి వేణుగోపాల స్వామి వారు
  • దక్షిణాన బొజ్జమ్మ గుట్ట రాజరాజెశ్వర స్వామి వారు
  • ఉత్తరాన రామప్ప గుట్ట రామలింగేశ్వర స్వామి వార్లు వెలసి ఉన్నారు.
  • కాళ్ళకల్ వనదుర్గా మాత ఆలయము కలదు ,
  • వెంకటాపురము(పిటి)లో లలితా పరమేశ్వరి దేవాలయం నిర్మాణంలో కలదు
  • గజ్వెల్ నియోజకవర్గములో తూప్రాన్ అతి పెద్ద మండలం
  • తూప్రాన్ మండలం క్రింద 132 పల్లెలు ఉన్నాయి

మండలంలోని గ్రామాలు[మార్చు]

Medak.jpg

No comments:

Post a Comment

Typing Test

Typing Test

Visit the Typing Test and try!